కియారా ఖాయమేనా? - kiara advani pair with jr ntr
close
Published : 17/05/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కియారా ఖాయమేనా?

ఎన్టీఆర్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటించనుందా? ఆ మేరకు ఆమెతో ఒప్పందం కుదిరిందా? ఈ ప్రశ్నలకి అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. విజయవంతమైన ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ కథానాయకుడిగా... కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. యువ సుధ ఆర్ట్స్‌, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ సంస్థలు     సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు ప్రస్తుతం మెరుగులు దిద్దుకొంటోంది. ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, కొరటాల శివ చేస్తున్న ‘ఆచార్య’ పూర్తయిన వెంటనే ఆ ఇద్దరి కలయికలో రెండో సినిమా షురూ అవుతుంది. అందుకే ఒక పక్క స్క్రిప్టు పనుల్ని కొనసాగిస్తూనే... మరోపక్క నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టింది చిత్రబృందం. కథానాయికగా కియారా ఎంపిక దాదాపుగా ఖాయమైనట్టే అని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కొరటాల తెరకెక్కించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంతోనే కియారా తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని