Kriti Sanon: అలరిస్తోన్న ‘మిమీ’ ట్రైలర్‌ - krithi sanon mimi trailer relased pankaj thipati laxman utekar
close
Published : 13/07/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kriti Sanon: అలరిస్తోన్న ‘మిమీ’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృతి సనన్, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్‌ చిత్రం ‘మిమీ’. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. దినేశ్‌ విజన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం జులై 30 నుంచి జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఈ ప్రపంచంలో తల్లీపిల్లల బంధమే చాలా గొప్పది’ అని పంకజ్‌ చెప్పే సంభాషణతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం అలరిస్తోంది. సరోగేట్‌ తల్లిగా (అద్దె గర్భం దాల్చడం) కనిపించి ఆకట్టుకుంది కృతి. అమెరికాకు చెందిన దంపతులు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని పొందాలనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న పంకజ్‌.. కృతికి చెప్తాడు. ఈ పద్ధతి గురించి తెలుసుకుని షాక్‌ అవుతుంది కృతి. ఈ విషయంపై కృతి, పంకజ్‌ మధ్య సాగే సన్నివేశాలన్నీ సరదాగా సాగాయి. డబ్బు కోసం సరోగేట్‌ తల్లిగా మారేందుకు కృతి ఓకే అంటుంది. ఈ విషయంలో కృతి వాళ్లింట్లో తెలియకుండా ఉండేందుకు పంకజ్‌ ఓ ప్లాన్‌ వేస్తాడు. ఈ క్రమంలో పంకజ్‌ ఎన్నో నవ్వులు పూయించారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో వాళ్లకో ట్విస్ట్‌ ఎదురవుతుంది. ‘మాకు ఆ బేబీ అవసరం లేదు’ అని అమెరికా దంపతులు నిర్ణయించుకుంటారు. కానీ, చివరగా కృతి బిడ్డకి జన్మనిస్తుంది. మరి ఆ బిడ్డని ఏం చేస్తారు? పంకజ్‌, కృతి మధ్య ఉన్న బంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని