స్వచ్ఛమైన గాలి.. పూల వనాలు - kritisanon told thar her shedule of bhediyam wrapped up
close
Published : 22/04/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వచ్ఛమైన గాలి.. పూల వనాలు

ముంబయి: కృతిసనన్‌... బాలీవుడ్‌లో బిజీగా ఉన్న తార. ఇప్పటికే రాజ్‌కుమార్‌ రావ్‌తో ‘హమ్‌ దో హమారే దో’, అక్షయ్‌కుమార్‌తో ‘బచ్చన్‌పాండే’ చిత్రాలను పూర్తిచేసిన ఈ భామ... టైగర్‌ష్రాఫ్‌ ‘గణపత్‌’, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాలను ఒప్పుకొంది. వరుణ్‌ధావన్‌తో కలిసి చేస్తున్న ‘భేదియా’ సినిమా షెడ్యూల్‌ ఇటీవలే ముగిసింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘‘కరోనా చుట్టుముడుతున్న ఈ సమయంలో... హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రకృతి సోయగాల మధ్య అన్ని జాగ్రత్తలు తీసుకొని షెడ్యూల్‌ పూర్తిచేశాం. స్వచ్ఛమైన గాలి, అందమైన పూల వనాల మధ్య కాలం అలా గడిచిపోయింది. థ్యాంక్యూ కరోనా ఫ్రీ హిమాచల్‌ప్రదేశ్‌’’ అంటూ ట్వీట్‌ చేసింది. వరుణ్‌ధావన్‌తో కలిసి అక్కడ చేసిన సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని