‘ఈటీవీ’ ఇంటర్వ్యూలో ‘క్షణక్షణం’ హీరో ఉదయ్‌శంకర్
హైదరాబాద్: సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘క్షణక్షణం’ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు యువ కథానాయకుడు ఉదయ్‌శంకర్. తన సినీ జీవితాన్ని మలుపుతిప్పేదిగా ఈ సినిమా ఉండబోతోందన్నాడు. ‘ఆటగదరాశివ’, ‘మిస్ మ్యాచ్’ చిత్రాల్లో నటించిన ఉదయ్ శంకర్ తదుపరి చిత్రం ‘క్షణక్షణం’. కార్తిక్ మేడికొండ దర్శకత్వం వహించారు. డార్క్ కామెడీ జోనర్‌గా డాక్టర్ వర్లు, డాక్టర్ మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ఉదయ్ శంకర్ ‘ఈటీవీ’తో పంచుకున్నారు.
‘క్షణక్షణం’ ప్రేక్షకులను ఎలా అలరిస్తుంది..?
ఈ చిత్రం ఒక థ్రిల్లర్ జోనర్. ఇది రెగ్యులర్‌గా వచ్చే థ్రిల్లర్ సినిమాల్లా కాకుండా ఇందులో మంచి డ్రామా ఉంటుంది. మంచి ఎమోషన్ ఉంటుంది. మధ్య తరగతి సమస్యలను కూడా సినిమాలో చూపించబోతున్నాం. అందుకే మీరంతా ఈ సినిమాను ఆస్వాదిస్తారు.
ట్రైలర్లో అంత సస్పెన్స్ పెట్టడానికి కారణం..?
ట్రైలర్ తయారు చేయడానికి కూడా 20 రోజులు పట్టింది. అందుకోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులకు ఏం చూపించాలి.. ఎంత మేర చూపించాలని బాగా ఆలోచించాం. మొత్తానికి 1.45నిమిషాల ట్రైలర్ వచ్చింది. ట్రైలర్లో అంతకంటే ఎక్కువ కూడా చూపించలేం.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది..?
నాది మధ్య తరగతి యువకుడి పాత్ర. మధ్య తరగతి ప్రజలు పడే కష్టాలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా అన్నీ ఉంటాయి. అనుకోని చిక్కుల్లో పడ్డ హీరో వాటి నుంచి ఎలా బయటపడ్డాడనేది కథ. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. సాధారణంగా మనం రోజూ బయట చూసే కష్టాలనే ఈ సినిమాలో చూపించాం. ప్రతి ఒక్కరూ నా పాత్రను వాళ్లకు వాళ్లు అన్వయించుకుంటారు.
సూపర్‌హిట్ చిత్రం ‘క్షణక్షణం’ టైటిల్‌ను మీ సినిమాకు పెట్టడానికి కారణం..?
నా రెండో సినిమాలో పవన్‌కల్యాణ్ గారి హిట్ సాంగ్ (ఈ మనసే) కావాలనే పెట్టాం. కానీ, ఈ సినిమాకు మాత్రం ఆ ఉద్దేశంతో పెట్టలేదు. మా కథకు ‘క్షణక్షణం’ టైటిల్ బాగా నప్పుతుందనే ఆ టైటిల్ పెట్టాం.
కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..?
ఏ స్టార్ హీరో అయినా సినిమాలో కథే అసలైన హీరో. మంచి కథతో ఏ హీరో తీసినా సినిమా విజయం సాధిస్తుంది. ఈ సినిమాలో కథ హీరో అని నేను నమ్ముతా. కంటెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. నా విషయానికి వస్తే మంచి కథ ఉండాలి.. అందులో నేనుండాలి.
కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశం..?
కథలో ట్విస్టులు నన్ను బాగా ఆకర్షించాయి. హీరో పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. నేను కూడా చాలా కష్టాలు పడి పైకి వచ్చాను. నేను కూడా నా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఎన్నో తిరస్కరణలకు గురయ్యాను. సినిమాలో హీరో పాత్ర కూడా అలాంటిదే. అందరికీ జాలి కలిగిస్తుంది. కథ కూడా చాలా బాగుంది. సినిమాలో మంచి ట్విస్టులున్నాయి. డైరెక్టర్ గారు సినిమాలో అన్నింటిని బాగా అమర్చారు.
స్టార్ వారసులైనా వాళ్లకు వాళ్లు నిరూపించుకోవాల్సిందేనన్న బన్నీవాసు మాటలు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది..?
ఆయన మాటలు విన్న తర్వాత నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. గీతా ఫిల్మ్స్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్లకెప్పటికీ నేను రుణపడి ఉంటాను.
సంగీత దర్శకులు కోటిగారితో ప్రయాణం ఎలా ఉంది..?
ఈ సినిమాలో కోటిగారు లాయర్ పాత్రలో నటించారు. చిన్న పాత్ర అయినా చాలా కీలకమైన పాత్ర అది. గొప్ప సంగీత దర్శకులు అయినా.. మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఆయన కూడా ఇబ్బంది పడకుండా పని చేశారు. షాట్ బాగా వచ్చే వరకూ ఎన్ని టేకులైనా తీద్దామన్నారు. ఆయన అంతలా కష్టపడతారని మేం ఊహించలేదు. ఆయన చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకు ఆయన ఒక సర్ప్రైజ్.
ఎప్పుడైనా వెనక్కి వెళదామని అనిపించిందా..?
ఎక్కడా అలా అనిపించలేదు. కష్టమైనా.. ఇష్టమైనా.. మనకు తెలిసింది ఇదొక్కటే. బాగా చేయగలిగింది ఇదొక్కటే. మనల్ని మనం నిరూపించుకోవాలన్నా ఇదే దారి. రవితేజ, విక్రమ్ గారిలాగా కొంచెం ఆలస్యమైనా పక్కా సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకొని వచ్చాను.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’