Romantic New Trailer: ‘రొమాంటిక్‌’ కొత్త ట్రైలర్‌.. అదరగొట్టిన ఆకాశ్ పూరీ - latest akash puri starer romantic movie new trailer out now
close
Updated : 26/10/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Romantic New Trailer: ‘రొమాంటిక్‌’ కొత్త ట్రైలర్‌.. అదరగొట్టిన ఆకాశ్ పూరీ

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నటుడు ఆకాశ్‌ పూరీ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘రొమాంటిక్‌’ నుంచి ఓ సరికొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది.

‘రొమాంటిక్‌ బ్యాడ్‌ యాస్‌’గా విడుదలైన ఈ ట్రైలర్‌లో ఆకాశ్‌ పూరీ రోల్‌ గురించి కొంతవరకూ చూపించారు. ‘‘మై నేమ్‌ ఈజ్‌ వాస్కోడిగామా.. ఏక్‌ దిన్ యే బచ్చా.. సబ్‌ కా బాప్‌ బనేగా’’, ‘‘పుట్టింది పడుకోవడానికి కాదు. చనిపోయాక పడుకో’’ అంటూ ఆకాశ్‌ చెప్పే మాస్‌ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో రమ్య గొవార్కర్‌ అనే అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. గోవా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్యాంగ్‌స్టర్లు.. అందులోని ఓ కుర్రాడి ‘రొమాంటిక్‌’ ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రానికి కథ, కథనం సంభాషణలు అందించారు.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని