శాకుంతల.. దుష్యంతుడు
హైదరాబాద్: సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. నీలిమ గుణ నిర్మాత. మణిశర్మ స్వరాలందిస్తున్నారు. మహాభారతం.. ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్ పాత్రను సమంత పోషిస్తుండగా.. దుష్యంతుడి పాత్రలో కనిపించే నటుడెవరన్నది ఇంత వరకు ప్రకటించలేదు. అయితే దీనిపై చిత్ర బృందం శనివారం స్పష్టతనిచ్చింది. ఈ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి సమంత కూడా తన ట్విటర్లో చిన్న టీజర్‌ని పంచుకుంది. ‘‘ఇతనే నా అందాల రాకుమారుడు దుష్యంత్’’ అంటూ ఆ పోస్ట్‌కి ఓ వ్యాఖ్యను జత చేసింది. గ్రాఫిక్స్‌కి ఎంతో ప్రాధాన్యమున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఈనెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
కొత్త పాట గురూ
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..