close
Published : 11/04/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

#BB3: బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చేశారుగా

వీకెండ్‌ గిఫ్ట్‌తో నందమూరి ఫ్యాన్స్‌ ఫిదా

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికే #BB3 అనే ట్యాగ్‌ ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి వీకెండ్‌లో ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆదివారం ఉదయం ఓ బిగ్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఈమేరకు ఉగాది కానుకగా ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు  ప్రకటించింది. దీంతో అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు.

‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్‌, శ్రీకాంత్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వేసవి కానుకగా మే 28న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని