close
Published : 02/03/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’ 

‘A’ ర్యాపిడ్‌కట్‌ ట్రైలర్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా కథనే నమ్ముకుని వచ్చే చిన్న చిత్రాలకు క్రైమ్‌థ్రిల్లర్లే మంచి ఫార్ములా. మార్చి 5న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్న ‘A’ చిత్రం కూడా ఆదే కోవకు చెందిందే. నితిన్‌ ప్రసన్న, ప్రీతి అశ్రానీ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగి రాలేనిదైనా నాకు సంతోషమే’ అంటూ హీరో చెప్తున్న డైలాగ్‌ ఆ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తుంది. అలాగే అందులో కనిపిస్తున్న విజువల్స్‌ చూస్తే ఒక లోతైన కథను నేపథ్యంగా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. అవంతికా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యుగంధర్‌ ముని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ కురాకుల సంగీతం అందిస్తున్నారు. మరి లేటెందుకు ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని