close
Published : 24/02/2021 20:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గంగారాం చౌదరిగా అభిషేక్‌ బచ్చన్!

ఆగ్రా: బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ వైవిధ్యమైన కథలతో పాటు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. తాజాగా ఆయన ‘దాస్విన్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తుషార్‌ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఆగ్రా సెంట్రల్‌ జైలు సెట్‌లో ప్రారంభమైంది. అక్కడే ఓ జైలు సెట్‌ని నిర్మించారు. ఇందులో అభిషేక్‌ ‘గంగారాం చౌదరి’ అనే పాత్రలో నటించారు.  బేక్ మై కేక్ ఫిల్మ్స్, మడోక్‌ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దినేష్‌ విజ్జన్‌ నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ ఆగ్రాలోని వివిధ ప్రదేశాలలో ఓ నెలపాటు కొనసాగుతుందని సమాచారం. అభిషేక్‌ బచ్చన్‌ ఇప్పటికే ‘ది బిగ్‌ బుల్‌’, ‘బాబ్‌ బిస్వాస్‌’వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని