Anushka: హమ్మయ్య ఇది పాత ఫొటోనే - actress anushka photo goes viral in internet
close
Published : 14/05/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anushka: హమ్మయ్య ఇది పాత ఫొటోనే

వైరల్‌గా మారిన ఫొటో

హైదరాబాద్‌: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో సన్నగా, నాజుకుగా కనిపించి అందర్నీ కట్టిపడేసిన ముద్దుగుమ్మ అనుష్కశెట్టి. అభిమానులందరూ స్వీటీ అని పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ ఫొటో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఆమె చాలా బొద్దుగా కనిపించారు. అది చూసిన పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది అనుష్క లేటస్ట్‌ ఫొటోనా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులు ఆ ఫొటో గురించి చిన్న క్లారిటీ ఇచ్చారు. అది గతేడాది దిగిన ఫొటో అని స్పష్టం చేశారు.

డిసెంబర్‌లో అనుష్క హరిద్వార్‌ని సందర్శించారని.. అక్కడి స్వామిజీతో ఫొటోలు దిగారని, అదే ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిందని చెప్పారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ కారణంగా అనుష్క ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

గతేడాది విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఏ ప్రాజెక్ట్‌లోనూ కనిపించలేదు. త్వరలోనే ఆమె ఓ విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా ఈ సినిమాలో అనుష్క కథానాయికగా కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు కెరీర్‌ ఫామ్‌లో ఉన్న సమయంలో అనుష్క ‘సైజ్‌ జీరో’లో నటించిన విషయం తెలిసిందే. అందులోని పాత్ర డిమాండ్‌ చేయడంతో అనుష్క స్వతహాగా బొద్దుగా మారాల్సి వచ్చిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని