Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా - actress nivetha thamos latest interview on vakeelsaab movie
close
Published : 18/04/2021 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా

హైదరాబాద్‌: కొవిడ్‌ కారణంగా గత కొన్నిరోజుల నుంచి తాను ‘వకీల్‌సాబ్‌’ ప్రమోషన్స్‌లో భాగం కాలేకపోయానని నటి నివేదా థామస్‌ అన్నారు. అందుకు తాను ఎంతో బాధపడ్డానని ఆమె తెలిపారు. తాజాగా కరోనా నుంచి కోలుకున్న నివేదా ‘వకీల్‌సాబ్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు మీకోసం..

బాధపడ్డా..!

‘‘వకీల్‌సాబ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని.. ఆ సినిమా గురించి ఎన్నో విశేషాలు బయటకు చెప్పాలని ఎంతో ఆశపడ్డా. కాకపోతే అనుకోని విధంగా కొవిడ్‌ బారిన పడడంతో సినిమా ప్రమోషన్స్‌లో భాగం లేకపోయా. దాని వల్ల ఎంతో బాధపడ్డా. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఇదే నా మొదటి ఇంటర్వ్యూ’’

కొవిడ్‌.. సాధారణం కాదు..!

‘‘కొవిడ్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కరోనా ఉంది. ఎవ్వరి నుంచైనా మనకి కరోనా రావచ్చు. జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన కరోనా రావడానికి ఛాన్స్‌ లేదు అని చెప్పలేం. కరోనా అంటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం కాదు.. ఎందుకంటే, దీనివల్ల మన రోగనిరోధక శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి’’

నెగటివ్‌ వచ్చాకే సినిమా..!

‘‘కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే నేను థియేటర్‌కు వెళ్లి ‘వకీల్‌సాబ్‌’ చూశాను. థియేటర్‌లో ప్రేక్షకుల సందడి చేసి నాకెంతో ఆనందంగా అనిపించింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నా జీవితంలో అది ఓ అందమైన రోజుగా చెప్పుకుంటా. ఆరోజు ఎప్పటికీ మర్చిపోను’’

వాళ్లకే థ్యాంక్స్‌ చెప్పాలి..!

‘‘పింక్‌’ లాంటి మంచి కథను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత దిల్‌రాజుకు థ్యాంక్స్‌ చెప్పాలి. ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ సర్‌కి పెద్ద థ్యాంక్స్‌. ఎందుకంటే మూడేళ్ల తర్వాత ఆయన కమ్‌బ్యాక్‌ చిత్రంగా ఇలాంటి కథను ఎన్నుకోవడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఇందులో ఆయన నటించడం వల్ల ఈ కథ మరెంతో మందికి చేరువైంది. అలాగే, వేణు తప్ప మరెవరూ ఈ కథను ఇంత బాగా చిత్రీకరించలేరు’

పవన్‌ క్రేజ్‌కి ఫిదా..!

‘‘థియేటర్‌లో సినిమా చూసిన సమయంలో ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్‌ చూసి నేను ఫిదా అయిపోయా. స్క్రీన్‌పై ఆయన పేరు పడగానే ప్రతి ఒక్కరూ గోల గోల చేశారు. అలాగే ఫైట్‌ సీక్వెన్స్‌, కోర్టు రూమ్‌ సీన్స్‌, ‘మగువా మగువా’ పాటను సైతం ప్రతిఒక్కరూ బాగా ఎంజాయ్‌ చేశారు. ప్రేక్షకుల క్రేజ్‌ చూసినప్పుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’’

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదుర్స్‌

‘‘వకీల్‌సాబ్‌’లోని ప్రతి సన్నివేశానికి తమన్‌ అందించిన మ్యూజిక్‌ అదిరిపోయింది. ట్రైన్‌ ఫైట్‌ తర్వాత వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ నాకు బాగా నచ్చింది. నటీనటుల నటనని సంగీతంతో ప్రేక్షకులకు మరింత చేరువ చేయొచ్చని తమన్‌ నిరూపించారు’’

పవన్‌ చాలా సైలెంట్‌

‘‘పవన్‌కల్యాణ్‌ సర్‌ గురించి నాకు ఎక్కువగా తెలీదు. మొదటిసారి ఆయన్ని సెట్‌లో కలిసినప్పుడు ఆయన చాలా తక్కువగా మాట్లాడారు. ఆయన ఫుల్‌ సైలెంట్‌ అని అర్థమైంది. సెట్‌లో మేము చాలా తక్కువగా మాట్లాడుకున్నాం’’

ఫుల్‌ నవ్వుకున్నా

‘‘సినిమా చిత్రీకరణ సమయంలో ముఖ్యంగా కోర్టు రూమ్‌ డ్రామా షూట్‌ జరుగుతున్నప్పుడు మేము బాగా నవ్వుకున్నాం. మామూలుగానే నేను తక్కువగా మాట్లాడే అమ్మాయిని. కాబట్టి సెట్‌కి వచ్చి నా వర్క్‌ని పూర్తి చేసుకునేదాన్ని. ఇక ‘మగువా మగువా’ పాట షూట్‌ చేస్తున్నప్పుడు మమ్మల్ని బాగా నవ్వమని వేణు చెప్పారు. దాంతో పాట షూట్‌ అప్పుడు ఫుల్‌గా నవ్వుకున్నాం’’

ప్రకాశ్‌రాజ్‌.. మంచి వ్యక్తి

‘‘నేను కలిసి మంచి వ్యక్తుల్లో ప్రకాశ్‌రాజ్‌ సర్‌ ఒకరు. కోర్టు రూమ్‌ సీన్స్‌ చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఆయన మాతోనే కలిసి భోజనం చేసేవాళ్లు. అలాగే మాకోసం కూడా ఇంటి వద్ద నుంచి ఫుడ్‌ తీసుకువచ్చేవాళ్లు’’

అవి నాకు బాగా దగ్గరయ్యాయి..

‘‘ఈ సినిమాలోని అన్ని సన్నివేశాలు నాకు బాగా చేరువయ్యాయి. ముఖ్యంగా కోర్టురూమ్‌ సీన్లు, అలాగే సూపర్‌ ఉమెన్‌ సీన్‌ నాకు బాగా నచ్చింది. సూపర్‌ ఉమెన్‌పై సోషల్‌మీడియాలో వస్తోన్న మీమ్స్‌ చూసి ఫుల్‌ నవ్వుకుంటున్నా’’





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని