Tollywood: ఆస‌క్తి రేకెత్తిస్తోన్న అదిత్ లుక్‌ - adhit new look from his upcoming films
close
Updated : 08/06/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ఆస‌క్తి రేకెత్తిస్తోన్న అదిత్ లుక్‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: యువ న‌టుడు అదిత్ అరుణ్ హీరోగా చాణక్య‌ చిన్నా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘క‌థ కంచికి మ‌నం ఇంటికి’. నేడు అదిత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో త‌ల‌పై నెత్తుటి మ‌ర‌క‌ల‌తో క‌నిపించి ఆస‌క్తి పెంచుతున్నాడు. అత‌ని వెన‌క విల‌న్‌ గ్యాంగ్ క‌నిపిస్తుంది. మ‌రి వాళ్ల‌కి, అదిత్‌కి మ‌ధ్య ఏం జ‌రిగింది?  తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో అదిత్ స‌ర‌స‌న పూజిత పొన్నాడ న‌టిస్తోంది. మహేశ్ మంజ్రేక‌ర్‌, స‌ప్త‌గిరి, వినోద్ కుమార్‌, శ్యామ‌ల‌, హేమంత్‌, గెట‌ప్ శ్రీను త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎం.పి. ఆర్ట్స్ ప‌తాకంపై మోనిష్ ప‌త్తిపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్  సంగీతం అందిస్తున్నారు. దీంతోపాటు ‘డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ’,  ‘డియ‌ర్ మేఘ’ చిత్రాల్లోనూ న‌టిస్తున్నాడు అదిత్‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ కొత్త పోస్ట‌ర్ల‌ని పంచుకున్నాయి చిత్ర బృందాలు.

 



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని