Cinema News: ‘శుభ్‌మంగళ్‌...’ కలయిక మళ్లీ! - after the shubh mangal saavdhan franchise ayushmann khurrana and aanand l rai team up once again
close
Published : 17/06/2021 10:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘శుభ్‌మంగళ్‌...’ కలయిక మళ్లీ!

ముంబయి: బాలీవుడ్‌లో మరోసారి ఓ విజయవంతమైన కలయికలో సినిమా రానున్నట్టు తెలుస్తోంది. దర్శకనిర్మాత ఆనంద్‌ ఎల్‌ రాయ్, యువ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా కలిసి పని చేయనున్నారట. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మాతగా, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘శుభ్‌మంగళ్‌ సావధాన్‌’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈసిరీస్‌లో వచ్చిన ‘‘శుభ్‌మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ ఆకట్టుకుంది. దాంతో ఆయుష్మాన్‌తో ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ మరో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. కానీ ఇది ‘శుభ్‌మంగళ్‌   సావధాన్‌’కు సిరీస్‌ చిత్రం కాదట. మరో కొత్త తరహా కథతో రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువభాగం అమెరికాలోనే ఉంటుందని సమాచారం. ఈ చిత్రంతో అనిరుధ్‌ అయ్యర్‌ గణపతి దర్శకుడిగా పరిచయం కానున్నారు. నవంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని