బన్నీ సోదరిగా ఐశ్వర్య రాజేష్‌! - aishwarya rajesh as bunnys younger sister
close
Published : 26/04/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ సోదరిగా ఐశ్వర్య రాజేష్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. ఇందులో బన్ని సోదరిగా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తోందని వార్తలు వినిపిస్తోన్నాయి. ఓ ఫారెస్ట్ అధికారి కారణంగా తన చెల్లెలు చనిపోవడంతో అతనిపై పగ తీర్చుకోవడం కోసం పుష్పరాజ్‌ ఎర్రచందనం దొంగగా మారతాడట.

ఇటీవల చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇందులో మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మైత్రిమూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌, అనసూయ తదితరులు నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 13న సినిమా విడుదల కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని