close
Published : 17/04/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పశువైద్యుడి కథతో అజయ్‌ ‘గోబర్‌’

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ నుంచి కొత్త చిత్రం రానుంది. సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ నిర్మించనున్న ఈ సినిమా పేరుని ‘గోబర్‌’గా నిర్ణయించినట్టు  ప్రకటించారు. 1990ల నాటి కథతో సాగే చిత్రమిది. స్థానికి ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడే ఓ పశువైద్యుడి నేపథ్యంలో కథ నడుస్తుంది.

అజయ్‌దేవ్‌గణ్‌ మాట్లాడుతూ  ‘‘గోబర్‌ కథ అందరికీ బాగా దగ్గరయ్యేలా ఉంటుంది. చాలా వినోదాత్మకంగా సాగుతుంది. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు వినోదం, విశ్రాంతి కచ్చితంగా దొరుకుతాయి. నవ్వులు పండమే కాదు కాస్త ఆలోచననూ రేకెత్తిస్తుంది ఈ చిత్రం’’అని చెప్పారు. సాబల్‌ షెకావత్‌ తెరకెక్కించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని