సీబీసీఐడి అధికారిగా అజిత్‌ - ajith kumar is playing the role of a cbcid in valimai
close
Published : 13/06/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీబీసీఐడి అధికారిగా అజిత్‌

చెన్నై: తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకుడు. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో తెలుగు యువ కథానాయకుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తుది దశ చిత్రీకరణకు చేరుకున్న ఈ సినిమా.. కొవిడ్‌ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా ఆగింది. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా అజిత్‌ పాత్ర విషయంపైనా స్పష్టత ఇచ్చారు. ‘‘ఈ చిత్రాన్ని మేం తొలుత చాలా మంది సీనియర్‌ నటులతో చిత్రీకరించాం. కానీ, గతేడాది కరోనా తర్వాత షూట్‌ పునఃప్రారంభించినప్పుడు వాళ్లు చిత్రీకరణలో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో కొత్త నటీనటులతో ఆ సన్నివేశాలు తిరిగి చిత్రీకరించాం. ప్రస్తుతం విదేశాలలో తెరకెక్కించాల్సిన ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రమే మిగిలి ఉంది. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించగానే చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో అజిత్‌ సీబీసీఐడి అధికారిగా కనిపిస్తారు’’ అని వినోద్‌ చెప్పారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని