చెప్పుల దండేస్తామని బెదిరించారు: నిరుపమ్‌ - alitho saradaga nirupam paritala manjula
close
Published : 12/05/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెప్పుల దండేస్తామని బెదిరించారు: నిరుపమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: డాక్టర్‌బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్‌. ఎంతోపేరు తీసుకొచ్చిన ఆ సీరియళ్ల వల్లే తనకు సినిమా అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎందుకలా జరిగిందో ఆలీ వ్యాఖ్యతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్నారు. తన భార్య మంజులతో కలిసి తాజాగా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధాలు ఇచ్చారు. సీరియల్‌ను సీరియల్‌లా కాకుండా వ్యక్తిగతంగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయని, అలాంటి కొందరు తనకు ఫోన్‌ చేసి చెప్పుల దండ వేసి సన్మానిస్తామని బెదిరించారని ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలియాలంటే.. మే 17 ‘ఈటీవీ’లో ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమోను చూసి ఆనందించండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని