Allu Arjun: మూడు ఓకే.. ఇంకో మూడు లైన్‌లో - allu arjun upcoming projects
close
Updated : 11/06/2021 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: మూడు ఓకే.. ఇంకో మూడు లైన్‌లో

బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైన ఐకాన్‌స్టార్‌

హైదరాబాద్‌: భారీ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప’. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బన్నీ.. రీలోడ్‌ చేసిన గన్‌లా సెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శరవేగంగా ‘పుష్ప’ని పూర్తి చేసి తన తదుపరి సినిమాలను ఒక్కొక్కటిగా పట్టాలెక్కించనున్నారు. ఇంతకీ బన్నీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు ఏమిటంటే..


మొదటి మూడు పక్కా..!

అల్లు అర్జున్‌ నుంచి రానున్న మొదటి మూడు సినిమాల్లో..  మొదటిది ‘పుష్ప’. బన్నీ-సుకుమార్‌ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. చిత్రీకరణ చాలావరకూ పూర్తయ్యింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ స్పెషల్‌ వీడియో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా పూర్తైన వెంటనే ఆయన వేణుశ్రీరామ్‌ డైరెక్షన్‌లో ‘ఐకాన్‌ కనబడుటలేదు’ చేయనున్నారు. ఇందులో మన హీరో.. ఫుల్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. వేణుశ్రీరామ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ‘ఐకాన్‌’ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇక ముచ్చటగా మూడో సినిమా.. ‘పుష్ప-2’. భారీ కథతో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ను కేవలం రెండున్నర గంటల నిడివిలో చూపించడం కష్టమవుతుందని భావించిన సుకుమార్‌.. దానిని రెండు భాగాల్లో సిద్ధం చేస్తున్నారు. అలా, ‘ఐకాన్‌’ పూర్తవగానే బన్నీ మరలా ఊరమాస్‌ లుక్‌లోకి మారిపోతారు.


ఈ మూడు కూడా ఓకే కానీ..

‘పుష్ప’, ‘ఐకాన్‌’, ‘పుష్ప-2’.. ఆ తర్వాత వెంటనే బన్నీ మరో మూడు సినిమాలు చేయనున్నారు. అందులో ఒకటి మురుగదాస్‌, మరొకటి బోయపాటి శ్రీను, ఇంకొకటి కొరటాల శివతో. అయితే, ఈ మూడు ప్రాజెక్ట్‌లు ఓకే అయినప్పటికీ ఏది ముందు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు బన్నీ - ప్రశాంత్‌నీల్‌ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా విక్రమ్‌ కుమార్‌ సైతం బన్నీ కోసం ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని