అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
ముంబయి: సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే హత్య సన్నివేశాలు కల్పితమే అయినా భయం గొల్పుతాయి. ముఖ్యంగా అలాంటి సన్నివేశాల్లో నటించేటపుడు నటీనటులు జాగ్రత్తగా ఉండాలి. నటనకు నిజానికి మధ్య తేడా గమనించి నటించాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు జరగొచ్చు. ఇలాంటి ఘటనే ‘దిల్ దడ్కనే దో’చిత్రీకరణలో క్షణాల వ్యవధిలో తప్పిపోయిందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘2015లో జోయా అక్తర్ డైరెక్షన్లో ‘దిల్ దడ్కనే దో’అనే చిత్రంలో నటించాను. అందులో ప్రియాంకా చోప్రా, రణ్‌వీర్‌సింగ్‌లకు తండ్రిగా నటించాను. కథ అంతా ఒక క్రూజ్ నౌకలో నడుస్తుంటుంది. రాహుల్ బోస్ ఆ చిత్రంలో ప్రియాంకకు కాబోయే భర్తగా నటించాడు. అయితే ఓ సన్నివేశంలో అతను ప్రియాంకతో గొడవపడుతూ ఆమెను కొట్టబోయే సీన్ ఉంటుంది. నేను దాన్ని అడ్డుకోవాలి. ఆ క్రమంలోనే బోస్‌ని గోడకు అదిమిపెట్టి చేత్తో గొంతు నుమలాలి. కానీ, ఆ క్షణంలో ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి నిజంగానే బలంగా అతని గొంతుపై నా చేత్తో నొక్కాను. ఆ సమయంలో ఎక్కడినుంచి వచ్చిందో నా చేతిలో ఒక వైర్ ఉంది. దాంతో మరింత బలంగా నొక్కేయబోయాను. సెట్లో వాళ్లు గమనించి కట్ చెప్పారు. లేదంటే దాదాపు బోస్‌ని చంపేసేవాడినేమో. ఆ సీన్ పూర్తికాగానే సెట్లోని వాళ్లంతా ‘ ఏమైందీ ఏకే.., ఇక్కడా సినిమా షూటింగ్ మాత్రమే జరుగుతుంది’ అంటూ నన్ను నియంత్రించారు. నా జీవితంలో అది అత్యంత దురదృష్టకరమైన సంఘటన’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సీన్‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో ఉంచారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా