Cinema News: ఆలోచన.. ఆవేశాన్ని కలిగించే చిత్రం - ardha shathabdham team press meet
close
Updated : 08/06/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఆలోచన.. ఆవేశాన్ని కలిగించే చిత్రం

‘‘సమాజంలోని అసమానతలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రమే మా ‘అర్ధ శతాబ్దం’’ అన్నారు దర్శకుడు రవీంద్ర పుల్లె. కార్తీక్‌ రత్నం, నవీన్‌ చంద్ర, సాయికుమార్, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. కృష్ణప్రియ కథానాయిక. ఈనెల 11న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో   విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ వేదికగా విలేకర్లతో ముచ్చటించింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నవీన్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘‘నేనిప్పటి వరకు చేయని విభిన్నమైన పాత్రని ఈ సినిమాలో చేశా. ఉమేష్‌ చంద్ర పాత్రను ఆధారం చేసుకొని నా పాత్రను డిజైన్‌ చేశారు’’ అన్నారు. ‘‘నేనిందులో మధ్యతరగతి కుర్రాడిగా నటించాను. అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి.. అనుకోని పరిస్థితుల్లో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనేదే ఈ సినిమా’’ అన్నారు కార్తీక్‌ రత్నం.

సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఆలోచన, ఆవేశాన్ని కలిగించే చిత్రమిది. అన్ని అంశాలు చక్కగా కుదిరాయ’’న్నారు. ‘‘అందరి సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది. రవి చిత్రాన్ని బాగా మలిచాడు. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తున్నా’’ అన్నారు నిర్మాత చిట్టి కిరణ్‌. ఈ కార్యక్రమంలో శుభలేఖ సుధాకర్, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి సంగీతం: నోఫెల్‌ రాజ, ఛాయాగ్రహణం: వెంకట ఆర్‌.శాఖమూరి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని