close
Published : 27/03/2021 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షారుఖ్‌ - అట్లీల చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే!

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అట్లీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులతో బిజీగా ఉన్నాడు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఆగస్టులోనే సినిమాని ప్రారంభించనున్నారట. షారుఖ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అందులో ఒకటి ఎన్‌.ఐ.ఏ. అధికారి కాగా మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా‌. 2019 నుంచి షారుఖ్‌ - అట్లీల చిత్రంపై ఇప్పటికే అనేక రకాల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం షారుఖ్‌ - సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ‘పఠాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తుండగా జాన్ అబ్రహం విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని