ముంబయి: దేశంలో కరోనా నిబంధనలు సడలించాక చిత్రసీమలో షూటింగ్ పనులు వేగవంతమయ్యాయి. కొత్త చిత్రాల సందడి పెరిగింది. కరోనా మహమ్మారితో వాయిదా పడిన చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యేందుకు సన్నద్ధమయ్యాయి. తాజాగా బాలీవుడ్‌కి చెందిన పలు చిత్రాలు తమ విడుదల తేదీని ప్రకటించాయి. క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న చిత్రం ‘83’. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్, ఫాంటమ్, నదియాద్వాలా, విబ్రీ మీడియాలు కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాని జూన్ 4, 2021న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో కపిల్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించగా ఆయన భార్య రోమి పాత్రలో దీపికా పదుకొణె నటించింది.
ఇక సిద్దార్థ మల్హోత్రా, విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘షేర్షా’. కియారా అడ్వాణి కథానాయిక. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్టైన్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాని ఈ ఏడాది జులై 2న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇదే వరసలో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న గ్యాంగస్టర్ చిత్రం ‘బెల్ బాటమ్’. రంజిత్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్ - ఎమ్మే ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాణీకపూర్, హ్యుమా ఖురేషి, లారా దత్తా తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా మే 28న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’