Akshay Kumar: ‘బెల్ బాట‌మ్’ విడుద‌ల ఖరారు - bollywood actor akshay kumar announce bell bottom movie release date
close
Published : 15/06/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akshay Kumar: ‘బెల్ బాట‌మ్’ విడుద‌ల ఖరారు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘బెల్ బాట‌మ్’. అక్ష‌య్ కుమార్ హీరోగా రంజిత్ ఎం.తివారీ తెర‌కెక్కించిన చిత్రమిది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా థియేటర్లు తాత్కాలికంగా మూత‌ప‌డ‌టంతో ఈ చిత్రం డిజిటల్ మాధ్య‌మం వేదిక‌గా విడుద‌ల‌వుతుందంటూ ప్ర‌చారం సాగింది. ప్ర‌ముఖ ఓటీటీలో ఈ సినిమా ప్ర‌సారం కానుందంటూ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. తాజాగా వాట‌న్నింటికీ స‌మాధానం ఇచ్చాడు అక్ష‌య్. ఈ చిత్రాన్ని థియేట‌ర్లలోనే విడుద‌ల చేస్తున్న‌ట్టు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ప్ర‌క‌టించాడు. జులై 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం. వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. పూజ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2021 ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సి ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని