Amitabh Bachchan: షూటింగ్ మొద‌లెట్టారు - bollywood actor amitabh bachchan started shoot at mumbai
close
Published : 14/06/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amitabh Bachchan: షూటింగ్ మొద‌లెట్టారు

ముంబ‌యి: కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త త‌గ్గ‌ముఖం ప‌ట్ట‌డంతో కొన్ని నిబంధ‌న‌లతో సినిమా చిత్రీక‌ర‌ణ‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ సోమ‌వారం షూటింగ్‌లో పాల్గొన్నారు. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మాస్క్ ధ‌రించిన ఫొటోని పంచుకున్నారు. ‘‘స‌మ‌యం ఉద‌యం 7గంట‌లు. ప‌నికోసం వెళ్తున్నాను. లాక్‌డౌన్ 2.O త‌ర్వాత తొలిసారి షూటింగ్‌లో పాల్గొంటున్నాను. రోజురోజుకి ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తున్నాయి’’ అని పేర్కొన్నారు. అయితే అమితాబ్ ఏ సినిమా చిత్రీక‌ర‌ణ‌కి హాజ‌ర‌వుతున్నారో చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో ‘మేడే’, ‘గుడ్ బై’ చిత్రాలున్నాయి. న‌టి నీనా గుప్త సైతం సెట్స్‌లో అడుగుపెట్టారు. ‘‘బ్యాక్ టు షూట్’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఆమె ‘గుడ్ బై’  చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని