విద్యాబాలన్‌ జోరు - buzz on vidya balan new movie
close
Published : 20/06/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యాబాలన్‌ జోరు

ముంబయి: కొత్తదనం నిండిన ప్రయోగాత్మక  కథలకు చిరునామాగా నిలుస్తుంటుంది నటి విద్యాబాలన్‌. ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ జోరు చూపిస్తోంది. ఆమె త్వరలో సురేష్‌ త్రివేణి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పుడిదింకా పట్టాలెక్కకుండానే.. విద్యా మరో కొత్త సినిమాకి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. తనూజ్‌ గార్గ్, అతుల్‌ కాస్బెకర్ల సంయుక్త నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌ రూపొందనుంది. యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ శిర్షా గుహా ధౌర్తా ఈ చిత్రానికి   దర్శకత్వం వహించనున్నారు. పితృస్వామ్య వ్యవస్థపై ఓ విమర్శనాస్త్రంగా ఈ సినిమా తెరకెక్కించనున్నారని బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇందులో విద్యాబాలన్‌కు జోడీగా ‘1992 స్కాం’ ఫేం ప్రతీక్‌ గాంధీ నటించనున్నట్లు తెలుస్తోంది. 45రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ సినిమా పట్టాలెక్కించనున్నారని, ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభమవుతుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని