close
Published : 18/02/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘చెక్‌’మేట్‌తో ఒక డ్యూయెట్‌!

హైదరాబాద్‌: చంద్రశేఖర్‌ యేలేటి, నితిన్‌ కాంబోలో వస్తున్న ఆసక్తికర చిత్రం ‘చెక్‌’. తాజాగా ఇందులోని ఒక డ్యూయెట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ‘నిన్ను.. చూడలేక పోతున్నాను..’అంటూ సాగుతున్న  పాటలో నితిన్‌, ప్రియా వారియర్‌ రొమాన్స్‌ చేశారు. ఈ గేయానికి శ్రీమణి సాహిత్యం అందించగా కల్యాణ్‌మాలిక్‌ స్వరాలు సమకూర్చారు. హరిచరణ్‌, శక్తిశ్రీ గోపాలన్‌ ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ‘ట్రైలర్‌’సినిమాపై ఆసక్తి మరింత పెంచుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిచంద్‌, సంపత్‌ రాజ్‌, హర్షవర్థన్‌ వంటి ప్రముఖ నటులు ఉన్న ఈ చిత్రాన్ని భవ్యక్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చెస్ గేమ్‌ నేపథ్యంగా వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 26న థియేటర్లలో సందడి చేయనుంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని