CHECK.. ఓటీటీలో వచ్చేస్తోంది - check ott release date announcement
close
Published : 12/05/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CHECK.. ఓటీటీలో వచ్చేస్తోంది

రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన చిత్రబృందం

హైదరాబాద్‌: నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘చెక్‌’. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘సాహసం’ వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్లను రూపొందించిన చంద్రశేఖర్‌ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికలు. అనుకోని కారణాల వల్ల ఉగ్రవాదిగా ముద్రపడి జైలుకెళ్లిన ఓ యువకుడు మరణశిక్ష నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు జైలు నుంచి ఎలా బయటకు రాగలిగాడు? ఇలాంటి ఉత్కంఠను రేకెత్తించే అంశాలతో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ‘చెక్‌’ థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘చెక్‌’ను ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ మేరకు మే 14న సన్‌నెక్ట్స్‌లో ‘చెక్‌’ సందడి చేయనుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని