close
Published : 29/03/2021 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘చిట్టి’రత్నం ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన సినిమాల్లో ‘జాతిరత్నాలు’చేసిన సందడి అందరికి తెలిసిందే. థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హిట్టుకొట్టారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై నాగఅశ్విన్‌ నిర్మించగా అనుదీప్‌ దర్శకత్వం వహించారు. నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, ఫరియా తమ కామెడీ టైమింగ్‌తో గిలిగింతలు పెట్టారు. ముఖ్యంగా ‘చిట్టి నీ నవ్వంటే’అంటూ సాగే పాట ప్రతీ ప్రేక్షకుడి నోట పలికింది. రామ్‌ మిరియాల ఆలపించి, రథన్‌ బాణీలు కట్టిన ఈ సాంగ్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. తాజాగా ఆ పాట పూర్తి వీడియోను యూట్యూబ్‌ వేదికగా విడుదల చేశారు. మరి లేటెందుకు మీరు చూసి ఆనందించండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని