cinema bandi: నెట్‌ఫ్లిక్స్‌ మొద‌టి స్థానంలో...! - cinema bandi top in netflix
close
Published : 16/05/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

cinema bandi: నెట్‌ఫ్లిక్స్‌ మొద‌టి స్థానంలో...!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే) నిర్మాత‌లుగా మారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం ‘సినిమా బండి’. ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇటీవ‌ల ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. కొత్త న‌టుల‌తో స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డే పాత్రల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాకు విశేష‌ణ ఆద‌రణ ల‌భిస్తోంది. సినీ ప్ర‌ముఖులు సైతం ఈ చిత్రంపై ప్రశంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా మ‌రో ఘ‌న‌త ద‌క్కించుకుని తెలుగు సినీ ఖ్యాతిని చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్ టాప్ టెన్ జాబితాలో తొలిస్థానం సంపాదించింది ఈ చిత్రం. విడుద‌లైన త‌క్కువ రోజుల్లోనే ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌నుకున్నా ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఓటీటీ వేదిక‌గా విడుదల చేశారు ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. 





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని