Cinema Bandi.. ట్రైలర్ అదిరిందండి - cinema bandi trailer out now
close
Published : 30/04/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema Bandi.. ట్రైలర్ అదిరిందండి

హైదరాబాద్‌: ‘లాంగ్‌ డ్రైవ్‌’, ‘వై మీ’ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు చేరువైన దర్శకుడు ప్రవీణ్‌. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నకథతో ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘సినిమా బండి’. గ్రామంలో నివసించే ఓ వ్యక్తికి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని ‘సినిమా బండి’లో చూపించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

టౌన్‌లో నివసించే ఓ వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే, ఓ రోజు అతని ఆటోలో ఎవరో ప్రయాణికుడు కెమెరా మరిచిపోయి వెళ్లిపోతాడు. సినిమాపై ఉన్న మక్కువ వల్ల దొరికిన కెమెరా సాయంతో తన ఊరిలోనే ఉన్నవారిని పెట్టి సినిమా తెరకెక్కించే పనిలో పడతాడు. అదే సమయంలో కెమెరాని పోగొట్టుకున్నవాళ్లు దాని కోసం వెనక్కి వస్తే..? ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఆ వ్యక్తి సినిమా పూర్తి చేయగలిగాడా? అనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మే 14న ‘సినిమా బండి’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని