స్టాండప్‌ రాహుల్‌ - cinema
close
Published : 12/05/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాండప్‌ రాహుల్‌

‘కూర్చుంది చాలు.. ఇక లేవండ’ని పిలుపునిస్తున్నారు కథానాయకుడు రాజ్‌తరుణ్‌. ఇప్పుడాయన హీరోగా సాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నంద కుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. ఈ సినిమాకి ‘స్టాండప్‌ రాహుల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కూర్చుంది చాలు.. అనేది ఉపశీర్షిక. మంగళవారం రాజ్‌తరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే పోస్టర్‌లో ఆయన జనాల మధ్య నుంచోని మైక్‌ పట్టుకొనిమాట్లాడుతున్నట్లుగా కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో స్టాండ్‌ కామిమో అని రాసుంది. ‘‘యువతరం మెచ్చే ఓ విభిన్నమైన రొమాంటిక్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంద’’ని చిత్ర బృందం తెలిపింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని