ఓటీటీలో వర్మ ‘డి - కంపెని’ - d company release in ott
close
Published : 05/05/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో వర్మ ‘డి - కంపెని’

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ చిత్రం తెరకెక్కించారు. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘డి - కంపెనీ’ పేరుతో రూపొందిన ఈ సినిమాని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఈనెల 15న స్పార్క్‌ ఓటీటీలో ఈ చిత్రం ప్రసారం కానుందని మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించనున్నారు దర్శకుడు. అలాగే అతను స్థాపించిన డి-కంపెనీ నీడలో బతికిన ఇతర గ్యాంగ్‌స్టర్ల జీవితాల్ని ఈ చిత్రంలో స్పృశించారు’’ అని చిత్ర బృందం తెలియజేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని