ముంబయి: సినిమా ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నటీనటులను సత్కరించేందుకు ముంబయిలో ఫిబ్రవరి 20న దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. కాగా.. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులను అవార్డులు వరించాయి. సుశాంత్‌సింగ్, అక్షయ్ కుమార్, సుష్మితా సేన్, కియారా అడ్వాణీ వేర్వేరు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్నారు.
గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డ యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ను ‘విమర్శకుడు మెచ్చిన నటుడి’గా జ్యూరీ ప్రకటించింది. సుశాంత్ చివరిసారిగా 2019లో వచ్చిన ‘చిచోరే’ చిత్రంలో కనిపించాడు. ఆ చిత్రాన్ని నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ‘ఛపాక్’ చిత్రంలో నటనకు గానూ దీపిక పదుకొణె ఉత్తమ నటిగా పురస్కారం సొంతం చేసుకుంది. అక్షయ్‌కుమార్ ‘లక్ష్మీబాంబ్’తో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. కియారా అడ్వాణీ ‘గిల్టీ’ చిత్రంతో ‘విమర్శకులు ఎంచుకున్న ఉత్తమ నటి’ విభాగంలో పురస్కారం సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా తానాజీ (ది అన్సంగ్ వారియర్) నిలిచింది. ఉత్తమ దర్శకుడు : అనురాగ్ బసు (లుడో). ఉత్తమ సిరీస్ : స్కామ్ 1992, ఉత్తమ వెబ్‌సిరీస్ నటిగా సుష్మితాసేన్ (ఆర్య)ను పురస్కారాలు వరించాయి.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ