Deleted Scene: వెదవెప్పుడూ వెదవే.. - deleted scene chaavu kaburu challaga
close
Published : 09/05/2021 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Deleted Scene: వెదవెప్పుడూ వెదవే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగిల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మురళీశర్మ, ఆమని కీలక పాత్రలు పోషించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారం అవుతోంది. కాగా.. సినిమాలోని డిలీట్‌ చేసిన సన్నివేశాన్ని ఆహా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకుంది. హీరోయిన్‌తో మాట్లాడుతూ.. మొదటి సారి చూసినప్పుడు నా మీద నీ అభిప్రాయం ఏంటీ..? అని హీరో ఆమెను ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తుంటాడు. పక్కనే ఉన్న ఓ ఆవిడ ఫోన్‌ మాట్లాడుతూ.. రాత్రి గాడిద తెల్లవారగానే గుర్రం అవుతదా ఏంటి..? వెదవెప్పుడూ వెదవే.. అంటూ చెప్పడం అవి హీరోకు కనెక్ట్‌ కావడం నవ్వులు పూయించేలా ఉంది. మీరూ చూసేయండి మరి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని