Dhanush: శేఖర్‌ కమ్ములతో ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ - dhanush and sekhar kammula project conformed by production house
close
Published : 18/06/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhanush: శేఖర్‌ కమ్ములతో ప్రాజెక్ట్‌ ఫిక్స్‌

అధికారిక ప్రకటన వచ్చేసింది

హైదరాబాద్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్‌లో కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు శేఖర్‌కమ్ముల. అలాగే, బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌లో రానున్న ‘ది గ్రే మ్యాన్‌’ షూట్స్‌తో ధనుష్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని