18న రానున్న నాని ‘సర్‌ప్రైజ్‌ సాంగ్‌’ - dhare ledha musical video will be realesed on june 18th
close
Published : 17/06/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

18న రానున్న నాని ‘సర్‌ప్రైజ్‌ సాంగ్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: భయానక కొవిడ్‌ పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి.. కరోనా బాధితుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం నేచురల్‌ స్టార్‌ నాని ఒక సర్‌ప్రైజ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికుల గొప్పతనం తెలియజేసేందుకు ఆయన ‘దారే లేదా’ అనే వీడియో సాంగ్‌ను రూపొందించారు. తాజాగా ఆ గీతం విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 18న సాయంత్రం 4.32గంటలకు ఈ పాటను ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు అంకితమిస్తూ విడుదల చేయనున్నారు. స‌త్యదేవ్‌, రూప కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. కె.కె. రచించగా.. విజ‌య్ బుల్గనిన్‌ స్వరాలు స‌మ‌కూర్చారు. వాల్ పోస్టర్‌ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్పణ‌లో తెలుగు, త‌మిళ భాషల్లో రూపొందింది ఈ గీతం. నిర్వహణ బాధ్యతలు ఛాయ్‌ బిస్కెట్‌ చూసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని