DilRaju: దిల్‌రాజుకు ట్విటర్‌ ఖాతా లేదు - dilraju is not in twitter
close
Published : 21/06/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

DilRaju: దిల్‌రాజుకు ట్విటర్‌ ఖాతా లేదు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌గా పేరుపొందిన దిల్‌రాజు ట్విటర్‌లో లేరని మరోసారి స్పష్టమైంది. ఈ మేరకు ఓ ట్వీట్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ‘నిర్మాత దిల్‌రాజుకు వ్యక్తిగతంగా ట్విటర్‌లో అధికారిక ఖాతా ఏమీ లేదు. SVC_Official పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతా మాత్రమే  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌కి  ఉన్న అధికారిక కమ్యూనికేషన్‌ ఛానెల్‌’ అని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈమేరకు దిల్‌రాజు పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతాలను ఎవ్వరూ ఫాలో కావొద్దని నెటిజన్లకు సూచించింది.

‘వకీల్‌సాబ్‌’తో నిర్మాతగా దిల్‌రాజు ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం రూపుదిద్దుకోనుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీనితోపాటు విజయ్‌-వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ భారీ ప్రాజెక్ట్‌కు సైతం ఈయనే నిర్మాత.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని