అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి - dishapatani about her career
close
Published : 18/06/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి

ముంబయి: బాలీవుడ్‌ యువతరం కథా నాయికల్లో దిశాపటానీ క్రేజే వేరు. యువతరంలో ఆమెకు చాలామంది అభిమానులున్నారు. ‘ఎమ్‌.ఎస్‌.ధోని’ చిత్రంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశ తనకంటూ ఓ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. వరసగా భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదేళ్లు పూర్తయ్యాయి. పైగా 28వ పుట్టినరోజుని జరుపుకొంది. ఈ సందర్భంగా దిశా మాట్లాడుతూ ‘‘నటిగా నాకు ఎన్నో గొప్ప అవకాశాలు దక్కినందుకు కృతజ్ఞురాల్ని. నేను నటించిన ప్రతి సినిమా నాకు ప్రత్యేకమే. ఇలా జరగాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదు. నటిగా పేరు తెచ్చుకున్నాను. పైలెట్‌ కావాలని చాలా కలలు కన్నాను. కానీ కాలేకపోయా. నేను ఒకటి కోరుకుంటే దేవుడు ఇంకోటి ఇచ్చాడు’’అని చెప్పింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక   వీడియోని పంచుకుంది. తను సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటన చిత్రాల్లో నటించింది. తను నటించిన తొలి ప్రకటన చిత్రానికి సంబంధించిన వీడియో అది. దిశ ప్రస్తుతం ‘కేటీనా’, ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ చిత్రాల్లో నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని