close
Published : 02/03/2021 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!

హైదరాబాద్‌: వెంకటేష్‌, మీనా జంటగా గతంలో వచ్చిన మలయాళీ రీమేక్‌ చిత్రం ‘దృశ్యం’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. మొదటి భాగానికి శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ మెగాఫోన్‌ పట్టనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 5 నుంచి రోజువారీ‌ షూటింగ్‌ జరగునున్నట్టు చిత్రబృందం తెలిపింది. కొవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గని కారణంగా పరిమిత సిబ్బందితోనే చిత్రీకరణ చేయనున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం2’ ప్రముఖ ఓటీటీ ఆమెజాన్‌లో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. పార్ట్‌-3కి కూడా డైరెక్టర్‌ జీతూ స్క్రిప్ట్‌ను మలిచే పనిలో ఉన్నట్టు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు వెంకీ నటించిన ‘నారప్ప’తో పాటు ‘ఎఫ్‌3’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని