close
Published : 04/03/2021 22:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాంగ్‌రూట్‌లో దుల్కర్‌.. వదిలేసిన పోలీసులు

చెన్నై: ‘మహానటి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయనను పోలీసులు అడ్డుకొని వెంటనే వదిలేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. దుల్కర్‌ తన కొత్త కారులో అలప్పుళ బైపాస్‌ మీదుగా తిరువనంతపురం వెళుతున్నాడు. ఈక్రమంలో ఒక కూడలి వద్ద సిగ్నల్‌ పడటంతో కారు నిలిపేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే దుల్కర్‌ వద్దకు చేరుకున్నారు. మీరున్నది తప్పుడు మార్గం సరైన మార్గంలో వెళ్లాలని సూచించారు. వాళ్ల సూచన మేరకు ఆ దుల్కర్‌ వెంటనే కారును వెనక్కి తీసుకొని యూటర్న్‌ ద్వారా రోడ్డు అవతలివైపునకు వెళ్లాడు.

అయితే.. దీన్నంతటినీ ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌ కెమెరాలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌ అయింది. కొత్తగా నిర్మించిన బైపాస్‌ రహదారి గురించి దుల్కర్‌ సల్మాన్‌కు అవగాహన లేకపోవడంతో ఇలా జరిగిందని.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదని ఆ వీడియో తీసిన వ్యక్తి పేర్కొన్నాడు. కాగా.. దుల్కర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘కురుప్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా టైటిల్‌ ప్రకటించని మరో సినిమాలోనూ ఆయన నటిస్తున్నాడు.


CL8iR4cH2OJ

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని