close
Published : 09/04/2021 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓ వైపు పవన్.. మరోవైపు ధనుష్‌!

మాస్‌ సెలబ్రేషన్స్‌ @ టాలీవుడ్‌, కోలీవుడ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌‌: తమ అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు సినీ ప్రియుల ఆనందాన్ని చూడాలనుకునేవారికి దక్షిణాది చిత్రపరిశ్రమ మంచి వేదిక. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు.. పోస్టర్లకు పూలదండలు.. అభిమానుల డ్యాన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూపోతే ఒకటేమిటి.. ఎన్నో విశేషాలుంటాయి. కాగా, ఇప్పుడు దక్షిణాదికి చెందిన రెండు పెద్ద చిత్ర పరిశ్రమల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పరిశ్రమలకు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు శుక్రవారం విడుదలయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

ఇటు సాబ్‌..!

సిల్వర్‌స్క్రీన్‌పై పవన్‌ని చూడాలని మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ‘వకీల్‌ సాబ్‌’తో సమాధానం దొరికింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై హిట్‌ టాక్‌ అందుకుంది. చాలారోజుల తర్వాత స్క్రీన్‌పై పవన్‌ బొమ్మ పడడంతో థియేటర్ల వద్ద యువత భారీగా సందడి చేస్తోంది. డ్యాన్స్‌లు, ఈలలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్క్రీన్‌పై పవన్‌ పేరు పడగానే కేకలు వేస్తూ.. కాగితాలు ఎగురవేస్తున్నారు.

అటు పక్క కర్ణన్‌..!

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కర్ణన్‌’. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. చాలారోజుల తర్వాత ధనుష్‌ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు సినిమా హాళ్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.



1380329668524445702

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని