ఇంటర్నెట్ డెస్క్: యువ కథానాయకుడు శ్రీ విష్ణు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. లవ్లీ సింగ్ నాయిక. అనీష్ దర్శకుడు. మరో దర్శకుడు అనిల్ రావిపూడి పర్యవేక్షించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది, ఎస్. కృష్ణ నిర్మించారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. మహా శివరాత్రికి మార్చి 11న ‘గాలి సంపత్’ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అనిల్ రావిపూడి గారి మార్క్ ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అంతగా మాకు సహకారం అందించారాయన. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. ‘అనిల్ రావిపూడి సమర్పించు.. ఇది చాలా కొత్తగా ఉంది. అందరి ప్రయాణం చిన్న సినిమాల నుంచే పెద్ద స్థాయికి చేరుతుంది. అనుకున్న గమ్యం చేరుకున్న తర్వాత వచ్చిన దారి మర్చిపోతాం. ఇలాంటి డిస్కషన్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నిన్నటి తరం దర్శకులు పెద్ద చిత్రాలు చేస్తూనే చిన్న సినిమాలు చేశారు. ఇప్పటి దర్శకులూ ఇది అనుసరించాలి. పెద్దవాటితోపాటు చిన్న సినిమా చేయ్ అని అనిల్‌ని అడుగుతుండే వాణ్ని. ఆ ఆలోచనతో వచ్చిందే గాలి సంపత్. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’ అన్నారు నిర్మాత దిల్‌రాజు.
‘ఈ కథ ఎస్. కృష్ణది. నేను తెరకెక్కించిన ప్రతి కథలో కీలక పాత్ర పోషించాడు. స్వయంగా ఓ కథ రాసి తానే నిర్మాతగా మారాలనుకున్నపుడు నేనూ చిత్రంలో భాగస్వామి అవుతానన్నాను. గాలి సంపత్ అంటే చాలా మంది గాలికి తిరిగే వాడో, గాలోడో? అని రకరకాలుగా అనుకోవచ్చు. ప్రమాదం వల్ల రాజేంద్ర ప్రసాద్ గారికి మాట రాదు, గాలి మాత్రమే వస్తుంది. అదే చిత్ర కథ. ‘బాహుబలి’లోని కిల్కి భాషలా ఇందులో ఫిఫీ భాష అలరిస్తుంది. కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్ ఆకట్టుకుంటుంది. గాలి సంపత్ అంటే ఏంటో తెలియజేయడానికే ఈ సమావేశమన్నా’రు అనిల్ రావిపూడి. ‘ఇప్పటి వరకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. తొలిసారి నిర్మాతగా మారాను. అనిల్ నా జీవితంలోని కొత్త మలుపుకి శ్రీకారం చుట్టాడు. టీమ్ అందరూ కష్టపడ్డారు. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్.కృష్ణ.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!