close
Published : 25/02/2021 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకే రోజు రెండు పెద్ద సినిమాల విడుదల!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోనుందా..? అవుననే చెప్పాలి. ఎందుకంటే.. సాధారణంగా ఒకేరోజు ఒకటి అంతకంటే ఎక్కువ సినిమాలు విడుదల కావడం పెద్ద వింత కాదు. అయితే.. భారీ అంచనాలున్న సినిమాలు ఒకేరోజు విడుదలైతే మాత్రం విశేషమే. బాక్సాఫీస్‌ కూడా కళకళలాడుతుంది. పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌ సినిమాలు విడుదలయ్యే రోజు తమ సినిమా విడుదల చేయడానికి ఎవరూ సాహసం చేయరు. కానీ.. బాలీవుడ్‌ భామ ఆలియాభట్ చేసింది. ఆమె నటిస్తున్న చిత్రం ‘గుంగూబాయి కతియావాడి’. జూలై 30న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అదేరోజు ప్రభాస్‌ రొమాంటిక్‌ డ్రామా ‘రాధేశ్యామ్‌’ కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే అభిమానులకు పండగే. అయితే.. ఒక సినిమాపై మరో సినిమా ప్రభావం ఉండే అవకాశం మాత్రం లేకపోలేదు.

ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గుంగూబాయి కతియావాడి’లో మునుపెన్నడూ కనిపించని పాత్రలో ఆలియా కనిపించనుంది. గంగూబాయి కతియావాడి అనే మహిళ జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్‌ను తెరకెక్కించారు.  మరోవైపు ఇప్పటికే పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణకుమార్‌ రొమాంటిక్‌ డ్రామా ‘రాధేశ్యామ్‌’ను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌ సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే సందడి చేయనుంది. కాగా.. వాలంటైన్స్‌డే సందర్భంగా చిత్రబృందం ఓ చిన్న వీడియోను విడుదల చేసి అందరిలో ఆసక్తి రెట్టింపు చేసింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని