close
Published : 25/02/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘గంగూబాయి’వచ్చేస్తోంది!

ముంబయి: ఆలియాభట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’.హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబయి’లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామాతిపుర’ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా భన్సాలీ పుట్టినరోజు కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘అంతా అంటుంటారు ఇక్కడ అమావాస్య రాత్రులు ఉండవని ..ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుందట’ అంటూ మొదలయ్యే సంభాషణతోనే సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. మునపటి చిత్రాలకంటే పూర్తి భిన్నంగా ఆలియా తన నటనతో అదరగొట్టేలా టీజర్‌లో కన్పిస్తోంది.  ‘గంగూ చందమామ..చందమామలానే ఎప్పుడూ ఉంటుంది’ అంటూ ఆమె పవర్‌ఫుల్‌గా డైలాగులు పేల్చుతోంది. ఇందులో ఆలియా.. వేశ్యాగృహాలను నడుపుతూ ముంబయి మాఫియాతో సంబంధాలున్న ‘గంగూబాయి’పాత్రలో నటించింది. అయితే కొన్నాళ్ల క్రితం ఈ సినిమాను నిర్మించకూడదంటూ గంగూబాయి దత్తపుత్రుడుగా పిలవబడుతున్న బాబాజీషా ముంబయి కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఈ చిత్రం నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ కావడంతో మిగతా షూటింగ్‌ను పూర్తిచేస్తున్నారు.  ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. భన్సాలీ ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి లేటెందుకు ఆ గ్రాండ్‌ టీజర్‌ను మీరూ చూసేయండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని