తిరిగొచ్చిన ‘పుష్ప’
close
Updated : 07/02/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరిగొచ్చిన ‘పుష్ప’

మూడు నెలల్లో... రెండు కీలక షెడ్యూళ్లని పూర్తి  చేసినట్టు తెలిపింది ‘పుష్ప’ బృందం. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ తొలి భాగం సన్నివేశాలు దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో గతేడాది నవంబరు నుంచి చిత్రీకరణ చేస్తున్నారు. రెండో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని శనివారం హైదరాబాద్‌కి తిరిగొచ్చింది ‘పుష్ప’ బృందం. గిరిజనులు, అధికారుల సహకారంతోనే అక్కడ చిత్రీకరణని పూర్తయిందని కృతజ్ఞతలు తెలిపాయి సినీ వర్గాలు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని