close
Published : 11/04/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌కి ‘లైగర్‌’

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘లైగర్‌’ చిత్రీకరణ ఎక్కువగా ముంబయిలోనే జరుగుతోంది. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ఆండీ లాంగ్‌ నేతృత్వంలో ఇటీవల అక్కడ కొన్ని పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా అనన్య పాండే నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. ఆయన ఫైటర్‌గా, ఓ కొత్త అవతారంలో దర్శనమిస్తారు. ఈ చిత్రం కోసం ఆయన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తర్ఫీదు పొందారు. కండలూ పెంచారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని