ఊపిరినిచ్చే సాయం
close
Published : 12/05/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊపిరినిచ్చే సాయం

రోనా కష్ట కాలంలో దేశ ప్రజల్ని ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు నటుడు సోనూసూద్‌. దేశంలో ఏ మూల నుంచి సాయం కావాలని పిలుపు వినిపించినా.. వారిఅవసరాలు తీర్చి, అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్‌ నిల్వల కొరతకు పరిష్కారం చూపించేందుకు మరో అడుగు ముందుకేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. ముందుగా కొవిడ్‌ కేసులు అధికంగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఫ్రాన్స్‌ సహా ఇతర దేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌లను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై సోనూసూద్‌ మాట్లాడుతూ ‘‘ఆక్సిజన్‌ సిలిండర్స్‌ కొరతతో బాధ పడటం ప్రస్తుతం మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేం వీలైనంత మందికి సాయం చేస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్వరితగతిన ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడమే ఈ సమస్యకి పరిష్కారమని భావిస్తున్నా. అందుకే మా వంతుగా కొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. తొలి ప్లాంట్‌ ఆర్డర్‌ చేశాం. అది ఫ్రాన్స్‌ నుంచి 10 - 12 రోజుల్లో మన దేశానికి రానుంది’’ అన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని