close
Published : 15/04/2021 21:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తదుపరి చిత్రం ఎవరితో?

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ చేసే సినిమా ఎవరితో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మొన్నటిదాకా అయితే కొరటాల శివ దర్శకత్వంలోనే! ఆ   కలయికలో సినిమాని ఇదివరకు అధికారికంగానూ ప్రకటించారు. తర్వాత అనూహ్యంగా    ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని నిర్ణయించారు కొరటాల శివ. ఈ వేసవిలోనే ఆ చిత్రం పట్టాలెక్కనుంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా కొరటాల శివ చేయనున్న సినిమా వచ్చే యేడాది ఏప్రిల్‌ నుంచి మొదలవుతుందని యువసుధ నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీన్నిబట్టి ‘పుష్ప’ తర్వాత బన్నీ మరొక దర్శకుడితో సినిమా చేస్తారని స్పష్టమవుతోంది. మరి ఎవరితో ఆ సినిమా ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. బన్నీ కోసం ఇప్పటికే ‘ఐకాన్‌’ పేరుతో స్క్రిప్టుని సిద్ధం చేశారు శ్రీరామ్‌ వేణు. ‘వకీల్‌సాబ్‌’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆయనతోనే అల్లు అర్జున్‌ సినిమా చేస్తారా? లేక ఇతరత్రా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. కొన్నాళ్ల కిందట ‘కె.జి.ఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ అల్లు అర్జున్‌తో చర్చలు జరిపారు. మరి ఆ కలయికలో సినిమా పట్టాలెక్కుతుందా అనేది చూడాలి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని