Tollywood news: రాజ‘శేఖర్‌’కి జోడీగా...
close
Published : 08/06/2021 18:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood news: రాజ‘శేఖర్‌’కి జోడీగా...

రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్‌’. లలిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌.ఎల్‌.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. ఇందులో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారు. ఆ మేరకు మలయాళం కథానాయిక అను సితార, హిందీ తార ముస్కాన్‌ ఖుబ్‌చందానీని చిత్రబృందం ఎంపిక చేసింది. అను సితారకి ఇదే తొలి తెలుగు చిత్రం. ముస్కాన్‌ ‘జార్జ్‌రెడ్డి’ సినిమాతో సందడి చేసింది. రాజశేఖర్‌ 91వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. అందులో తెల్లటి జుట్టుతో రాజశేఖర్‌ కనిపించిన విధానం ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని