close
Published : 15/04/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలీవుడ్‌లో ‘అపరిచితుడు’

అపరిచితుడు... చియాన్‌  విక్రమ్‌లోని అద్భుత నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం. క్రియేటివ్‌   జీనియస్‌గా పేరుపొందిన శంకర్‌ ఈ చిత్రాన్ని తెర కెక్కించి అందర్నీ మెప్పించారు. మనుషుల్లోని నిర్లక్ష్యం, నిస్తేజం, స్వార్థం, అవినీతి... వంటి వాటిపై సూటిగా సంధించిన బాణమీ సినిమా. అలాంటి సినిమాని బాలీవుడ్‌లో తెరకెక్కిస్తారని గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్‌ స్టూడియోస్‌ సంస్థలో జయంతిలాల్‌ గడ దీన్ని పాన్‌ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ‘‘అన్నియన్‌(అపరిచితుడు) చిత్రాన్ని దేశ ప్రేక్షకులకు అందించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇది ఒక అపురూప చిత్రం. దీన్ని మళ్లీ చేయాలంటే... అంతటి నటులు ఎవరా? అని ఆలోచించా. రణ్‌వీర్‌ సింగ్‌లోని విభిన్నమైన నటనను మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం. అతనే ఈ కథకు న్యాయం చేయగలరనిపించింది.’’ అన్నారు. ‘‘శంకర్‌ దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాత్రకు న్యాయం చేయడానికి శక్తివంచన లేకుండా కష్టపడతా’’ అని రణ్‌వీర్‌ చెప్పుకొచ్చారు. నిర్మాత జయంతిలాల్‌ గడ మాట్లాడుతూ.. దర్శకుడు శంకర్‌, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కలయికే ఒక పెద్ద అద్భుతమ’’న్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని